11-11-2025 12:08:31 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కారము చూపాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కరరావు లతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి 50 అర్జీలను స్వీకరించారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 33, జిల్లా పంచాయతీ 4,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, ల్యాండ్స్ & సర్వే 2, ఇరిగేషన్ 2, మున్సిపాల్టీ 2,వైద్య శాఖ,మార్కెటింగ్,జిల్లా సంక్షేమ శాఖ,సివిల్ సప్లై,హౌసింగ్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో డిఆర్‌ఓ జయమ్మ, జడ్పీ సీఈవో శోభారాణి, డిఆర్డిఏ పి.డి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయ సింగ్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.