పుచ్చకాయ.. లాభాలు!
24-04-2024 12:00 AM
ఎండాకాలంలో చాలా ఎక్కువగా కనిపించే పండ్లలో ఒకటి పుచ్చకాయ. ఇది ఎండ వేడిని, తాపాన్ని తగ్గించి, శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో వీటిని మించి మరొకటి లేదని చెప్పొచ్చు.
n 95 శాతం వరకు నీరే ఉన్న ఈ పండును తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. అందుకే సమ్మర్ వచ్చిందంటే వీటికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది.
n పుచ్చకాయ పోషకాలకు పెట్టింది పేరు. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని సిట్రులైన్ శారీరక చురుకుదనాన్ని పెంచుతుంది.
n పుచ్చకాయలో ఉండే విటమిన్ సి, కెరొటినాయిడ్, లైకోపీన్, కుకుర్బిటాసిన్ సహా పలు యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ తో పోరాడేందుకు సాయపడతాయి. దీంతో క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.






