19 August, 2026 | 9:17 PM

ఎస్సీ వర్గీకరణపై వినతుల స్వీకరిస్తాం

12-11-2024 12:47 AM

 హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై వినతులు, అభిప్రాయాలను స్వీకరిస్తామని, ఎస్సీ రిజర్వేషన్స్ అధ్యయన కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ తెలిపారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్ మొదటి అంతస్తు బితు బ్లాక్‌లో సోమవారం ఆయన అధ్యయన కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఎవరైనా కార్యాలయానికి వచ్చి వినతులు అందించవచ్చని పేర్కొన్నారు. లేదా  0neman commission.scsc @gmal.comఅనే మెయిల్ అడ్రెస్‌కు పంపాలని సూచించారు.