calender_icon.png 24 December, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేము తప్పించుకున్న నేరస్థులం

24-12-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : ‘మేము భారత్‌లో ‘బిగ్ ఎస్కేపర్స్’ అంటూ..దేశాన్ని అపహాస్యం చేసేలా దేశం నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు లలిత్ మోదీ, విజయ్ మాల్యా జోక్‌లేసుకుంటూనవ్వుకున్నారు. భారత్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేశారు. ఈ మేరకు వారిద్దరూ తాజాగా లండన్‌లో పార్టీ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  వీడియోలో లలిత్, మాల్యా పలువురితో ఫోజులు ఇస్తూ ఫొటో దిగుతున్న విజువల్స్ ఉన్నాయి. పార్టీలో అతిథి  బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా, నటి ఇద్రిస్, ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఉన్నారు.