30 May, 2026 | 1:48 AM

17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాం

30-05-2026 01:11 AM

కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచి గుమ్మడికాయ కొట్టేదాకా సినిమాకు భుజం కాచే పెద్ద కొడుకు సినిమాటోగ్రాఫర్! ఇలాంటి కీలక శాఖలో తనదైన ప్రతిభను చూపిస్తున్నారు కిషోర్ బోయిడాపు. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చిన్న స్థాయి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈయన.. టాలీవుడ్‌లోనే కాక బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ‘మేము కాప్‌లం’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలుకరించారు.

ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా కిషోర్ బోయిడాపు చెప్పిన ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే.. “మా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉండటంతో సహజంగానే నాకు కెమెరాపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. 2002లో రవిప్రసాద్ యూనిట్‌లో కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించా. ఓ నాలుగేళ్ల తర్వాత ముంబై వెళ్లా. అక్కడ మొదటి ప్రాజెక్టు 15 హాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశా.

‘మేము కాప్ లం’ మొత్తం షూటింగ్‌ను కేవలం 17 రోజుల్లో పూర్తి చేశాం. మంచి ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్, ప్రతి డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడి పనిచేసినందువల్లే అది సాధ్యమైంది. ప్రస్తుతం నేను చేస్తున్న ప్రాజెక్ట్లు.. ‘ప్రేమకు నమస్కారం’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘మన డాక్టర్ బాబు’ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. మరో మూడు సినిమాలు చర్చల్లో ఉన్నాయి.