calender_icon.png 30 September, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేం పార్టీ మారలేదు!

30-09-2025 01:40:36 AM

  1. నియోజకవర్గ అభివృద్ధికే ముఖ్యమంత్రిని కలిశాం 
  2. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
  3. మీరు పార్టీ మారారు.. మా వద్ద ఆధారాలున్నాయి..
  4. స్పీకర్ ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాదన 
  5. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఫిర్యాదులపై స్పీకర్ విచారణ 
  6. రేపు బీఆర్‌ఎస్ తరఫున క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న న్యాయవాదులు

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి) : ‘మా ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు.. నియోజకవర్గ అభివృద్ధికే సీఎం రేవంత్‌రెడ్డిని కలి శారు’ అని పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదు లు..  లేదు.. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట వాద ప్రతివాదనలు వినిపించారు.

పార్టీ ఫిరాయింపుల ఎమ్మె ల్యేలకు సంబంధించిన కేసుపై మొదటి రోజు స్పీకర్ విచారణ ముగిసింది.  శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ప్రత్యక్ష విచారణ చేపట్టారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు వారి తరఫు న్యాయవాదులు హాజరయ్యారు.

వీరితో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు వీరి తరఫున న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. ఈ సం దర్భంగా పిటిషన్ దారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులకు మధ్య వాద ప్రతివాదనలు జరిగాయి. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఆసక్తికర ప్రశ్నలు వేశారు.

‘మీరు పార్టీ అనుమ తి మేరకే ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారా..? కాంగ్రెస్ లో చేరిన తర్వాత  పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా..? లేదా..? ’ వాటిని తెలుసుకోవడానికి ఫిర్యాదు చేశారా..? అని ప్రశ్నించారు. అందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా స్పం దిస్తూ ‘ పార్టీ అనుమతి మేరకే ఫిరాయింపులపై ఫిర్యాదు చేశాం. సుప్రీం కో ర్టులో కూడా పార్టీ తరఫునే వాదనలు సమర్పించాం’  అని బదులిచ్చారు.

అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిసిన ప్రక్రియను పార్టీ మా ర్పుగా చూడరాదని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొ ంటున్న ఎమ్మెల్యేల తరఫు లాయర్లు సూచించారు. తమ వేతనం నుంచి బీఆర్‌ఎస్‌ఎల్పీ ఖాతాలో రూ.5వేల   జమ అయిన విషయాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు వివరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది జంద్యాల రవిశంకర్ పాల్గొనడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. 


ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి:పల్లా 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సిగ్గుంటే తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు. పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం బహిరంగ రహస్యమేనని, తమ ఫిర్యాదుతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారని తెలిపారు. స్పీకర్ విచారణ ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ విచారణ చేపట్టారన్నారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున వచ్చిన న్యాయవాదులు తిమ్మిని బమ్మి చేసేందుకు ప్రయత్నం చేశారని, అసంబద్ధ ప్రశ్నలు వేసినా ఓపికతో సమాధానం చెప్పామన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరలేదని నిస్సుగ్గుగా చెప్తున్నారని మండిపడ్డారు.

పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. మా న్యాయవాదులు ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలను స్పీకర్‌కు ఇచ్చామని, పార్టీ మారారని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు అందజేశామని తెలిపారు.