12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి

18-03-2026 09:32 PM

ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలంలో మహిళా సంఘాల రుణాల రికవరీ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దోమకొండ కుమార స్వామి వీఓ, మంధర సంఘంలో లావణ్య సభ్యురాలి నుండి రూ.1 లక్ష స్త్రీనిధి రుణాన్ని రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ... మహిళలు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు.

ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రుణాలను ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించి, వాయిదాలను సమయానికి చెల్లించి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం, సీసీలు, వీఓఏ అధ్యక్షురాలు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.