12 July, 2026 | 2:14 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ

18-03-2026 09:26 PM

- పలువురు విద్యార్థులకు గాయాలు

సిద్దిపేట క్రైం: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వెనుకనుంచి రెడీమిక్స్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. సిద్దిపేటలోని రావుస్ స్కూల్ కు చెందిన బస్సు రోజూ మాదిరిగానే బుధవారం చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్, కమ్మర్లపల్లి, సలంద్రి, చౌడారం, మేడిపల్లి, ఇబ్రహీంనగర్ నుంచి పిల్లలను పాఠశాలకు తీసుకువస్తోంది.

ఇబ్రహీంనగర్ స్టేజి వద్ద పిల్లలను బస్సులో ఎక్కించుకోవడానికి ఆగడంతో వెనుక నుంచి వచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. దాంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.