18-02-2026 01:12:21 AM
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్ జాదవ్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): సెక్యులర్ పార్టీల మద్దతుతో మున్సిపల్ పీఠం గెలుచుకుని, మతోన్మాద పార్టీకి షాక్ ఇచ్చామని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు నరేష్ జాదవ్, అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రె స్ పార్టీ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ విజయోత్సవ ర్యాలీలో కీలక నేతలందరితో కలిసి వారు పాల్గొన్నారు.
మంగళవారం డీసీసీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల గుండా కొనసాగింది. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల జై కాంగ్రెస్ నినాదాలతో పట్టణ పురవీధులన్నీ మారుమ్రోగాయి. ర్యాలీలో దారి పొడువునా వాహనం పై నుండి మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, పార్టీ నేతలు ప్రజలకు అభివాదం చేసారు.
కాంగ్రెస్ శ్రేణులు తమ నేతలను అభిమానంతో తమ భుజానికెత్తుకుని నృత్యాలు చేసారు. అటు తనకు పదవి కట్టబెట్టిన బీఆర్‌ఎస్, ఎంఐఎం, స్వతంత్ర సభ్యులకు, కీలక పాత్ర పోషించిన నేతలకు నూతన ఛైర్పర్సన్ అనూష కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, నూతన కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.