11 April, 2026 | 10:45 PM

రాష్ట్రంలో రూ.10,700 కోట్ల లోన్లు ఇచ్చాం

17-12-2024 12:00 AM
  • 20 నుంచి హైటెక్స్‌లో ఎస్‌బీఐ మెగా ప్రాపర్టీ షో
  • బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్

హైదరాబాద్‌సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రూ.10,700 కోట్ల విలువైన లోన్లు పంపిణీ చేశామని ఆ బ్యాంకు హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్ తెలిపారు. హోమ్ లోన్ల మంజూరు కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా 27 సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో హైటెక్స్‌లో మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్టు సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని 50కిపైగా ప్రముఖ బిల్డర్లు తమ ప్రస్తుత, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులను ప్రదర్శించబోతున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌వాసుల డ్రీమ్ హోమ్ నిర్మాణానికి ఒక చోట అన్ని సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రాపర్టీ షో లక్ష్యమని పేర్కొన్నారు. ఈ షోలో ఇల్లు బుక్ చేసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేట్లలో తగ్గింపు ఉంటుందని స్పష్టంచేశారు.