11 April, 2026 | 9:08 PM

బీరకాయతో బోలెడు లాభాలు!

17-12-2024 12:00 AM

మార్కెట్‌లో మనకు రకరకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ మనం రుచిగా అనిపించే కూరగాయలను మాత్రమే ఏరికోరి తీసుకుంటాం. ఇక బీరకాయ వంటి కూరగాయలను అస్సలు పట్టించుకోం. వీటిని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బీరకాయల్లో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. డైటింగ్ చేసేవారికి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. 

* బీరకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసుకుని తాగితే ఆకలి వేయదు. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడం             సులభమవుతుంది.

* బీరకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. 

* కొందరికి సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడూ శరీరం వేడిగా ఉంటుంది. దానివల్ల చర్మం పగులుతుంది. అలాంటి వారు ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఫలితంగా చర్మం             కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 

* బీరకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

* బీరకాయలో ఉండే బయోటిన్, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. 

* బీరకాయలో జింక్, విటమిన్లు, ఎ,సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు    తగ్గిపోవడంలో సహాయపడతాయి. 

* బీరకాయలో పోటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హై బీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. 

* వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.