బీజేపీ ప్రటిష్టతకు కంకణబద్దులు కావాలి
బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
ఘట్ కేసర్, ఆగస్టు 2 (విజయక్రాంతి) : భారతీయ జనతా పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉన్నదని బిజెపి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల రోడ్డు లో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బస్వ రాజుగౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్య కార్యకర్తలను సన్మానించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ విచ్చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బూతు లెవల్లో పనిచేయాలని అప్పుడే మనం స్థానికంగా బలపడి ఎన్నికల్లో గెలుస్తామని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈకార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రామోజీ, గుండ్ల బాలరాజ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు మన్యం, భాస్కర్ గౌడ్, మాజీ ఎంపిటిసి లు శోభారాణి, కె. కరుణాకర్, సీనియర్ పార్టీ నాయకులు, శక్తి కేంద్ర నాయకులు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






