3 August, 2026 | 2:48 AM

కలిసి ఉంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం

03-08-2026 01:54 AM

రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శంకర్ స్వామీజీ

తాండూరు ఆగస్టు 2 (విజయ క్రాంతి) హిందువులు అంతా ఐక్యమత్యమై కలిసి ఉంటే నిలబడతామని విడిపోతే కూలిపోతామని... గడప వరకే కులం... గడప దాటితే హిందువులమని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో 76వ వారం సామూహిక శ్రీహనుమాన్ చాలీసా పారాయణానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నారులు బాల్యం నుండే రామాయణం, మ హాభారతం, తో పాటు చత్రపతి శివాజీ మ హారాజ్, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి తదితర దేశభక్తుల చరిత్ర , పురాణ ఇతిహాసాలు తెలిసి ఉండాలని అ న్నారు.

చిన్నారులకు ప్రతి గ్రామంలో సా మూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయ ణం చేయించాలని, తద్వారా ఐకమత్యం , భక్తి భావం, ధైర్యం, జ్ఞానం పెంపొందించుకోవచ్చని తెలిపారు. దేశభక్తుల చరిత్రతో పా టు పురాణ ఇతిహాసాల్లోని ప్రధాన ఘట్టాల ను ఆయన కులం కుశంగా వివరించారు. అ నంతరం స్వామివారికి మహా హారతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అల్పా హారం అందించారు. ఇంకా ఈ కార్యక్రమం లో హిందూ వాహిని కార్యకర్తలు , విశ్వహిందూ పరిషత్ నాయకులు, గ్రామస్తులు, యువకులు భారీగా పాల్గొన్నారు.