11 June, 2026 | 4:48 PM

SIR పై విమర్శలను ఖండించిన రామచందర్ రావు

11-06-2026 03:54 PM

సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Telangana BJP Chief Ramchander Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట బీజేపీ కార్యకర్తల దీన్ దయాళ్ ప్రశిక్షణ వర్గ్‌ను ఉద్దేశించి రాంచందర్ రావు ప్రసంగించారు. గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం “నాగరిక్ దేవో భవ” అనే స్ఫూర్తితో పరిపాలనను ముందుకు తీసుకెళ్తోందని సూచించారు. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విజయాలు, పరివర్తనాత్మక కార్యక్రమాలను తెలంగాణలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అంకితభావం, క్రమశిక్షణ, సేవా స్ఫూర్తితో బీజేపీ కార్యకర్తలు బలమైన తెలంగాణ, వికసిత్ భారత్ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు SIR ను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. SIRపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. ఓటర్ల ప్రక్షాళన సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ అన్నారు. BRS, కాంగ్రెస్, MIM ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రైతులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్యాయం చేశాయని తెలిపారు. పార్టీ శిక్షణా తరగతుల్లో ఎంపీ రఘునందన్, పలువురు నేతలు పాల్గొన్నారు.