29 July, 2026 | 9:13 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

కలెక్టరేట్ వద్ద రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయండి

11-06-2026 03:35 PM

దమ్మపేట, జూన్ 09 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికులకు గుదిబండగా ఉన్న మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఈనెల 12న  కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు కోరారు. దమ్మపేట, మందలపల్లి గ్రామపంచాయతీ కార్మికుల సమావేశం గురువారం జరిగింది.

ఈ సందర్భంగా మురహరి రఘు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు.   గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చినప్పటికీ, నేటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారానికి దశల వారి పిలుపులో భాగంగా రేపు జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు విజయలక్ష్మి, నరసమ్మ, భవాని, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.