2 May, 2026 | 7:25 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలి

13-11-2025 12:00 AM

ఎల్బీనగర్, నవంబర్ 12 : వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని బుధవారం వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ... ప్రపంచంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని, ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్నారు.

ఇందుకోసం వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పోరాడుతుందని, ఎంతోమంది పేదలకు తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. అందులో భాగంగా వనస్థలిపురంలో పెద్ది శంకర్ నిర్వహిస్తున్న ఉచిత వృద్ధాశ్రమంలో వృద్ధులకి మధ్యాహ్న భోజనం, చలికాలం సందర్భంగా బ్లాంకెట్లు పంపిణీ చేశామని, భవిష్యత్తులో ఉచిత ఆశ్రమాలు నిర్వహిస్తున్న వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని నేషనల్ డైరెక్టర్ నితిన్ చక్రవర్తి తెలిపారు.