11 June, 2026 | 2:06 AM

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి

11-06-2026 01:35 AM

అదనపు కలెక్టర్ ఖీమ ్య నాయక్

పెబ్బేరు, జూన్ 10: మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తు అందుతుందని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్ అన్నారు. ప్రజా పాలనప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామంలో ప్రత్యేక గ్రామసభ, పెబ్బేరు మున్సిపాలిటీలో వార్డు సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా రోడ్డు భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, వనమహోత్సవం, జల సంరక్షణ, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.