15 June, 2026 | 7:04 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ఎదగాలి

25-03-2026 12:33 AM

అరుణోదయ విమలక్క

ఖైరతాబాద్, మార్చి24(విజయాక్రాంతి): దొడ్డి కొమురయ్య స్పూర్తితో కురుమలు ఎదగాలని అరుణోదయ సాంస్కృతి సమాఖ్య  కన్వీనర్ విమలక్క సూచించారు. మంగళవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో కురుమ సంఘం అద్వర్యంలో దొడ్డి కొమురయ్య ఆత్మకు అవమానమా అన్న అంశం పై నిర్వహించిన పత్రిక గోష్టి కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురుమలు ప్రభుత్వం అందజేసే పధకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఐక్యతతో అభివృద్దిలోకి రావాలన్నారు. సమావేశంలో కురుమ సంఘం నాయకులు గొంగల పాండు మాట్లాడుతూ ప్రభుత్వం కురుమల అభివృద్దికి కోకాపేటలో కేటాయించిన స్థలం అన్యక్రాంతం అవుతోందని ఆరో పించారు.

ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కురుమ విధ్యార్థుల కోసం హస్టల్ భవనం, ఆత్మగౌరవ భవనాలు నిర్మించాల్సి ఉండగా కొందరు కురుమల ప్రోద్భలంతో ప్రయివేటు వ్యక్తులు స్వాధీన పరుచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సదరు స్థలం పై దర్యాప్తు చేసి కురుమలకే చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గురునాధ్ కురుమ, విజయ్ కుమార్ కురుమ, కంచు ప్రభాకర్ కురుమ, బీర్ల శ్రీనివాస్ కురుమ, వన్నాడి రమేష్ కురుమ పాల్గొన్నారు.