4 August, 2026 | 1:51 AM

కుల,మత వివక్షత లేని సమాజం కోసం కృషి చేయాలి

04-08-2026 12:00 AM

ఎమ్మార్పీఎస్ నల్లగొండ మండల నూతన కమిటీ ఎన్నిక

నల్లగొండ టౌన్, ఆగస్టు 3 : మత, కుల వివక్షత సాఘీక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం జరిగే కర్తవ్య నిర్వహణకై జాతిని సమగ్ర అభివృద్ధి వైపు నడి పించే దిశగా క్షేత్రస్థాయిలో ఎమ్మార్పీఎస్ బ లోపేతం చేయాలని ఎంఎస్పి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ అన్నారు సోమవారం స్థానిక పి ఆర్ టి యు భవన్లో నల్లగొండ మండల ఇన్చార్జ్ బొజ్జ దేవయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూలు కులాల రిజర్వేషన్లు సాధించిన అనంతరం జాతీయస్థాయిలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నా యకత్వంలో మాదిగల పేదరిక నిర్మూలన కోసం భవిష్యత్తు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు లేని వ్యవస్థ కోసం జరిగే ఈ పోరాటానికి మాదిగలు మరింత శక్తివంతంగా సిద్ధం అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం నల్లగొండ మండల ఎంఆర్పిఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎమ్మార్పీఎస్ నల్ల గొండ మండల అధ్యక్షులుగా:- దున్న శివ కుమార్,ప్రధాన కార్యదర్శిగా:- కాసార్ల శివశంకర్ మాదిగ,అధికార ప్రతినిధిగా :చింత సైదులు,ఉపాధ్యక్షులు చింత ఇంద్రకుమార్, బీపంగి సందీప్, బచ్చలకూరి శ్రీను.కార్యదర్శులు:- తీగల నాగరాజు, ఈసారం ప్రవీణ్, కందుకూరి నగేష్. పోతపాక లింగయ్య.సంయుక్త కార్యదర్శి ఇంజమూరి వినయ్ మాదిగ ప్రచార కార్యదర్శి:-బొజ్జ సందీప్ మాదిగ.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తీగల ఇంద్ర కుమార్, మంద సైదులు మాదిగ, బీపంగి చంటి, దీపంగి సైదులు, బీపంగి పెద్దలు యాద య్య, దాసరి సత్తయ్య, పాలడుగు శ్రీను, మామిడి కృష్ణ, బకరం జగన్, పులిగిల్ల కృష్ణ, విసరం శ్రవణ్, ఈసరం కృష్ణ దున్న పవన్, కొత్తపల్లి నాగరాజు, చింత రాములు, సర్పంచ్ సైదులు, వినయ్, ప్రసాదు, ప్రశాంతు తదితరులు పాల్గొన్నారు.