4 August, 2026 | 1:47 AM

డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

04-08-2026 12:00 AM

మెట్ పల్లి, ఆగస్టు3(విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ధోనికెల నవీన్ డిమాండ్ చేశారు. సోమవారం భాజపా కార్యకర్తలతో కలిసి ఆయన కళాశాలను సందర్శించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చదువుకుంటున్న విద్యార్థులు సౌకర్యాలు లేక నరకయాతన భరిస్తున్నారని క్లాస్ రూమ్ లో నాగుపాములు, విషపురుగుల మధ్యన భయం భయంగా చదువుకుంటున్నారని తెలిపారు.

కళాశాల ముందు కాంపౌండ్ వాల్ లేక చెరువును తలపించేలా పూర్తిగా నీటిమయమైందని, పక్కనే సబ్ స్టేషన్ ఉండడం కారణంగా విద్యుత్ ఎర్తింగ్ తో జంతువులు కరెంటు షాక్ కు గురయ్యాయని అన్నారు. క్లాస్ రూమ్ లో విద్యుత్ తీగలు నాగుపాములు ఉండడం పట్ల విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారని అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ పట్టించుకోకపోవడం సమంజసం కాదని తెలిపారు. కాలేజీ రాత్రి సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని పట్టించుకున్న నాధుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం మెట్ పల్లి ఆర్డీవో కు కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు జుంగుల అనిల్ గౌడ్, బత్తుల జగదీశ్వర్, ఐటీ సెల్ కన్వీనర్ పాసు కంటి శ్రీనివాస్,లోలపు అనిల్, భోగ దత్తు, గుంటుక హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.