ప్రగతి ప్రణాళికను విజయవంతం చేసేందుకు పాటుపడాలి
అంతా సమన్వయంతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 6 (విజయక్రాంతి): ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, ఇందుకోసం అంతా సన్వయంతో మందుకు సాగాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.
ఇందులో భాగంగా శుశ్రవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యాతిధిగా హాజరైన ఎంఎల్‌ఏ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతిప్రణాళి లక్ష్యాలు సాధించేందుకు కార్పోరేషన్ వ్యాప్తంగా కృషి చేయాలన్నారు. 99 రోజు ల కార్యక్రమంలో భాగంగా షెడ్యూల్ ఆధారంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో కార్పొరేటర్లు వారి వారి ప్రాంతాల్లో చేపట్టాల్సి కార్యక్రమాలను ప్రణాళికా బద్దంగా పూర్తి చేయాలన్నారు.
పారిశుధ్యానికి ప్రధాన్యత ఇవ్వాలని, ఇందులో ప్రజలను కూడా భాగ స్వాములను చేయాలన్నారు. విద్యా, వైద్య శాఖల కార్యక్రమాల నిర్వహణకు ఆయా అధికార యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి పెద్దపీఠ వేయాలని, వ్యవసాయానికి కావాల్సిన యూరియా ఎరువులు అందేలా చూడాలన్నారు.
ప్రభుత్వం ద్వారా ప్రజలకు అనేక మంచికార్యక్రమాలు చేశామని, దానిని కూడా ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి పాటుపడుతూ వారిలో ఆర్థిక స్థిరత్వం తెచ్చేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించేందుకు కృషి చేయాలని కూనంనేని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వామ్యంతో 99 రోజుల ప్రత్యేక కార్యచరణను విజయంవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడు గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితకుమారి, కమీషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ః కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 6 (విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు . శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పారిశుధ్య సిబ్బందితో కలిసి చీపురు పట్టిన పాలకవర్గ సభ్యులు
దమ్మపేట, మార్చి 6 (విజయక్రాంతి): ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుండి మార్చి 15 వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘా లు, యువకుల భాగస్వామ్యం తో మొదటి దశగా పారిశుధ్యం, ఫైల్ క్లియరెన్స్ 10 రోజుల ప్రత్యేక డ్రైవ్ లో శుక్రవారం దమ్మపేట పంచాయతీ పారిశుధ్య సిబ్బందితో కలిసి పాలక వర్గ సభ్యులు, కార్యదర్శి దమ్మపేట ప్రధాన సెంటర్ బాలాజీనగర్ రోడ్డుకు ఇరువైపుల చెత్తను తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పగడాల రమాదేవి, ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, బత్తుల సాయి, చాట్ల శ్రీను, ధర్మసోతు పద్మ, బద్దె వెంకటలీల, చిన్నశెట్టి నాగలక్ష్మి, పూనెం పోలమ్మ, దాసరోజు రామారావు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.




