17 April, 2026 | 7:11 PM

సమష్టిగా కృషిచేసి సంస్థాగత ఎన్నికల్లో విజయం సాధించాలి

29-05-2025 02:11 AM

బాన్సువాడ మే 28 (విజయ క్రాంతి): బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ లో బుధవారం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అగ్రో  ఇండస్ట్రీస్ కార్పొరేషన్  ఛైర్మెన్ కాసుల బాల్ రాజ్  కార్యకర్తల అవగాహన సదస్సులో మాట్లాడుతూ వచ్చే సంస్థాగత ఎన్నికలో  కొత్త పాత విబేధాలు  లేకుండా మన రాష్ట్ర  ముఖ్యమంత్రి  నాయకత్వాన్ని బలోపేతం  చేస్తూ సమిష్టిగా కష్ట పడుతూ ఎన్నికలో  విజయం సాధించాలని కార్యకర్తలను కోరడo  జరిగింది.

ఈ  కార్యక్రామములో జిల్లా  అధ్యక్షుడు కైలాష్  శ్రీనివాస్, మానాల మోహన్ రెడ్డి,జిల్లా  ఉమ్మడి మాజీ డీసీసీబీ  అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, అబ్సర్వర్లు వేణు గోపాల్  యాదవ్,సత్యనారాయణ  గౌడ్,ఖలేఖ్,బ్లాక్ కాంగ్రెస్  అధ్యక్షులు,మండల  అధ్యక్షులు,ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.