2 March, 2026 | 9:44 PM

మా కుమారుడి ఆచూకీ తెలపాలి

02-03-2026 08:02 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): మామడ మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన సూర్యవంశీ ప్రశాంత్ గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడ ఉపాధి పొందుతూ మిస్ అయ్యారని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన తండ్రి సూర్య ప్రకాష్ తో పాటు డ్రైవర్ ఉద్యోగంలో చేరినట్లు వాటికి వెళ్లిన తర్వాత చెప్పిన కుమారుడు మూడు నెలల నుంచి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. అక్కడి అధికారులతో తమ కుమారుడి ఆచూకీ తెరిపాలని కలెక్టర్ విన్నవించారు. అనంతరం ప్రవాసమిత్ర రాష్ట్ర అధ్యక్షులు స్వదేశీ పరికి పరికి పనులను కలిసి వినతి పత్రం అందించారు.