3 March, 2026 | 9:22 PM

మా పోడు భూములకు పట్టాలివ్వాలి

03-03-2026 07:48 PM

జేసిపిలతో గుంతలు తీస్తున్న ఫారెస్ట్ వాల్లను అడ్డుకున్న గిరిజనులు

ఆదివాసీ గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

మా గిరిజనులకు న్యాయం చేయాలి

తుడుందెబ్బ మండల అధ్యక్షులు చంద నవీన్

ఏటూరునాగారం,తాడ్వాయి,(విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామంలో ఎంగమ్మ చెరువు పరిధిలో గల ఉన్నటువంటి మా పోడు భూమిలో ఫారెస్ట్ అధికారులు జెసిపిలతో కందకాలు(గుంతలు)తవ్వుతున్నారని కాల్వపల్లి గ్రామాస్థులు అడ్డుకున్నారు. మా పోడు భూములు మాకే కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాడ్వాయి తుడుందెబ్బ మండల అధ్యక్షులు చంద నవీన్, ఏటూరునాగారం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు తాటి నిలాద్రీ మాట్లాడుతూ... మా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గత 20 ఏళ్లుగా ఉపాధిగా సాగు చేసుకుంటున్నామని మా పోడు భూములని ఫారెస్ట్ అధికారులు దర్జన్యంగా తీసుకోవద్దని మండిపడ్డారు.

గ్రామస్తులపైన ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం సరికాదని ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీలకు రాజ్యాంగ కల్పించినటువంటి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు.ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల హక్కులను ఉల్లంఘిస్తే ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదని తమ బతుకుదెరువుకు ఆటంకం కల్పిస్తే ఫారెస్ట్ అధికారులను గ్రామాల్లోకి రానివ్వం అని అన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములను కాపాడవలసిన బాధ్యత మీపై ఉంటుందని అలాగే పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని అన్నారు.