3 March, 2026 | 10:36 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 16 మందికి జరిమానా

03-03-2026 07:42 PM

- ఒకరికి మూడు రోజుల జైలు

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా 17 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నామని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు.

న్యాయమూర్తి విచారణ జరిపి, 16 మందికి కలిపి రూ.లక్షా 63 వేలు జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరికి రూ.5వేల చొప్పున రూ.10వేలు జరిమానా విధించారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.