calender_icon.png 20 December, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో గ్రామాభివృద్ధికి కృషిచేయాలి

20-12-2025 01:34:59 AM

చిట్యాల, డిసెంబర్ 19 (విజయ క్రాంతి): గ్రామ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప సర్పంచ్ గా ఎన్నికైన ఆకుల కృష్ణ మరియు కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను ఆయన శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నమ్ముల విజయ్ కుమార్, బండ కిష్టయ్య, బండ అంజయ్య, దోర్నాల రామచంద్రయ్య, చెరుకు స్వామి, చెరుకు రామలింగం, రాకకొండ శీను, అన్యబోయిన రమేష్, బుస్సు మధు, దొంతరబోయిన శ్రీకాంత్, బడే రవి, బొడిగ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.