20-12-2025 01:36:04 AM
చిట్యాల, డిసెంబర్ 19 : చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాస్ సేవాసమితి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో శుక్రవారం ఒక్కో జత స్పోరట్స్ డ్రెస్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు స్పోరట్స్ డ్రెస్ అందించేందుకు ముందుకు వచ్చిన దాస్ సేవాసమితి హైదరాబాద్ ఫౌండేషన్ చైర్పర్సన్ గాయత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే దుస్తులు తమ పాఠశాల విద్యార్థులకు అందించేందుకు సహకరించిన పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు చెన్నూరు నర్సింగరావు, ఉపాధ్యాయుడు పనకంటి వెంకట్రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మసరం శ్రీనివాస్, తనకంటి వెంకట్రావు, అఫ్జల్ షరీఫ్, ఉప్పల పద్మ, గుత్త రామ్ రెడ్డి, సల్ల వెంకట్ రమణ, జిల్లోజు వెంకటేశ్వర్లు కాశరాజు ప్రణయ, రేణుక తదితరులు పాల్గొన్నారు.