కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని మహిళా దినోత్సవం సందర్బంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపి ముఖరా కె మహిళలు నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు వచ్చి ప్రతి మహిళకు నెలకు రూ.2500, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, డిగ్రీ చేసిన ఆడపిల్లకు స్కూటీలు ఇస్తానని చెప్పి అధికారంలో వచ్చారు.
అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా హామీలు అమలు చేస్తాలేరని, దేవుళ్ళ మీద ఒట్లు వేసి ప్రజలను మభ్య పెట్టాడని, మహిళాలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని, మహిళా దినోత్సవం సందర్బంగా ముఖరా కే మహిళలు నిరసనలు తెలిపి వెంటనే ఈ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని మహిళలందరు కలిసి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, దైవశాల, సరోజ, లక్ష్మి, మరియు మహిళలు పాల్గొన్నారు.




