మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు
మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి
కామారెడ్డి,(విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి అన్నారు. ఆదివారం కామారెడ్డి సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కి చర్చి ఫాదర్ జోసఫ్ కీశోర్, శ్రీలత కిషోర్ ల ఆధ్వర్యంలో ఘనంగా షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్ధనలతో చైర్ పర్సన్ ఉమారానికి ఆశీర్వాదాలు అందచేశారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో మహిళలందరూ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, గతంలో లాగ వంటింటి కుందేల్లా కాకుండా అంతరిక్షంలో కొన్ని నెలలు గడిపిన ధీర వనిత సునీత విలియమ్స్ లాగ, రాష్ట్రపతిగా ఉంటూ యుద్ధ విమాణాల్లో ప్రయాణం చేసిన ధైర్యశాలి ద్రౌపది ముర్మ్ లాగా వున్నారు. దేశాన్ని పాలించిన ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో కూడా మహిళలు రాణించాలని కోరారు.
అదే విధంగా ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అన్యాయాలపై కూడా గలమెత్తి పోరాటం చేయాలని,సమాజంలో ప్రతీ ఒక్కరు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తమ కాళ్లపై తాము నిలబడగలమని నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐ చర్చి ఫాదర్ జోసఫ్ కిషోర్, జాన్ దయాకర్ సెక్రటరీ, చిరంజీవి, మాణిక్యం, సంపత్ కుమార్, సబితా విల్సటన్, శ్రీలత కిషోర్, వరలక్ష్మి హీమాలిన్, శాంత మహిపాల్, రోతర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.




