సీఎంవో అనుమతితోనే హెలికాప్టర్ వాడాం
18-10-2024 02:10 AM
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించడంతోపాటు జిల్లాల పర్యటనల్లో సమయాన్ని ఆదా చేయడానికి మంత్రులందరూ సీఎంవో అనుమతితోనే హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
వరదల సందర్భంగా కేంద్ర మంత్రుల పర్యటనలకు, సహాయ పునరావస చర్యలకు, గణేశ్ నిమజ్జనం సాఫీగా జరగడానికి హెలికాప్టర్ సేవలను వినియోగించినట్టు గురువారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. తనకుగానీ, ఇతర మంత్రులకుగానీ ఏ సందర్భంలోనూ హెలికాప్టర్ సేవలను సీఎంవో అనుమతి నిరాకరించలేదని స్పష్టంచేశారు.






