19 August, 2026 | 3:10 PM

Breaking News

ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •  

కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం

18-04-2025 01:21 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణరావు

పెద్దపల్లి మార్చి 17 (విజయక్రాంతి):  కటింగులు లేకుండా ధాన్యం కొనుగోల్లు చేస్తామని, త్వరలోనే కాలువల పూడుకతీత పనులు ప్రారంభిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల సింగిల్ విండో ఆధ్వర్యంలో  దేవునిపల్లె, కొదురుపాక, నారాయణపూర్, చిన్నకల్వల గ్రామాల్లో దాన్యం కొనుగోలు సెంటర్లను స్థానిక నాయకులతో  ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి కటింగులు లేకుండా గతంలో మాదిరిగానే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. కటింగ్ లో లేకుండా వడ్లు కొనుగోలు చేయడంలో పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే గుర్తింపు పొందిందని, సీడ్ వడ్లకు, పంటలకు కూడా డిమాండ్ పెరిగిందన్నారు. చిన్నకల్వల సింగల్ విండో సొసైటీ పరిధిలోని 9 గ్రామాల లోని 920 మంది రైతులకు  బోనస్ ద్వారా (2,58,54,000/-) రూ. 2 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ షచేయడం జరిగింద్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో అధ్యక్షుడు దేవరనేని మోహన్ రావు, చిలుక సతీష్, సీఈవో వి. రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, మాజీ ఎంపీటీసీ పన్నాల రాములు, మాజీ సర్పంచ్ సాగర్ రావు, మాజీ ఎంపిటిసి  మాధవ, సింగిల్ విండో సిబ్బంది, నాయకులు , కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.