23 May, 2026 | 2:48 AM

ఫ్యూచర్ సిటీని రద్దుచేస్తాం

23-05-2026 01:35 AM
  1. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తాం
  2. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం
  3. మాజీమంత్రి హరీష్‌రావు

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దుచేస్తామని మాజీమంత్రి హరీష్‌రావు స్పష్టంచేశారు. ఆ భూముల్లో ఫార్మా సిటీకే కేంద్ర పర్యా వరణ శాఖ అనుమతి ఇచ్చిందని, డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉందని గుర్తుచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న హరీష్‌రావు శుక్రవారం అక్క డ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రేవంత్ ప్రభు త్వం ఫ్యూచర్ సిటీ అని కేవలం డ్రామా చేస్తోందని విమర్శించారు.

హైకోర్టులో ఈ మధ్య ఒక కేసు వచ్చిందని, ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్  ప్రభు త్వం కోర్టుకు చెప్పిందన్నారు. రేవంత్ సర్కా ర్ కేవలం జిమ్మిక్కు చేస్తోందని, ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీససౌకర్యాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. 75 శాతం ఫార్మా సిటీ ఉండి మిగతా 25 పర్సెంట్ మిగతావి ఉండేలా చేస్తే, కానీ 75 శాతం మిగతా వ్యా పారం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు.

ఇది చట్ట ప్రకారం చెల్లద ని స్పష్టంచేశారు. కానీ కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ రద్దు వందశాతం చేస్తామని తేల్చి చెప్పారు. ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తామని, ఇది నా మాట కాదని, పార్లమెంట్ చట్టం ఇదే చెబుతుందని వెల్లడించారు. ఫార్మా సిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని, లక్షల కోట్ల వ్యాపా రం జరిగి రాష్ట్ర ఎకానమీ పెరుగుతుందని ప్రారంభించామని, మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని భావించామని గుర్తుచేశారు.

ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయిందని, లాస్ట్ వన్ ఇయర్ ఎలక్షన్ ఉంటుందన్నారు. ఇప్పటివరకు రేవంత్ సర్కార్ ఏమీచేయలేదని, భూములు పంచిపెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ధిపొందాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్‌ఎస్‌కు పేరు వస్తుం ది అనే ఆలోచనతతోనే ఇలా చేశారని మం డిపడ్డారు. వాళ్లు ఏమి చేసినా నడవదు, నిలబడదన్నారు. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటే వస్తుందని స్పష్టంచేశారు.