5 May, 2026 | 7:40 PM

కొత్తరకం పంటలపై రైతాంగానికి అవగాహన కల్పిస్తాం

05-05-2026 06:13 PM

అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న అవగాహన కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రాజు యాదవ్

బోథ్,(విజయక్రాంతి): రైతులు లాభసాటి వ్యవసాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అందుకే రైతన్ననికి అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేయడంతో పాటు అధిక దిగుబడులను ఇచ్చే పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని బోత్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్యను పేర్కొన్నారు.

మంగళవారం మండల కేంద్రం సమీపంలోని భగవాన్ రెడ్డి అనే రైతుకు చెందిన ఆయిల్ ఫామ్ తోటలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రైతులకు అధికారులు పంటల సాగుపై అవగాహన కలిగించడంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందే పంటలకు వివరాలను తెలిపారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని కేవలం రైతుబంధుతో సరిపెట్టిందన్నారు.

తమ ప్రభుత్వం రైతన్నకి అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఆర్చిత్రు డి ఎ వో వెంకటేశ్వరరావు వివిధ మండలాల ఏవోలు హార్టికల్చర్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్యుతానంద రెడ్డి రహీముద్దీన్ దినేష్ వినయ్ రెడ్డి సన్నీ గడ్డల నారాయణ రైతులు భగవాన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నర్సారెడ్డి ఎల్టి లింగారెడ్డి గుండయ్య ప్రసాద్ రెడ్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు