ప్రవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రించాలని వినతి
హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వాటిని నియంత్రించాలని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఎంఈఓ వీడపు శ్రీనివాస్ కి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత విద్యాసంస్థలతో పోలిస్తే ఫీజులు ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారని, ఈటెక్నో, డెవలప్మెంట్, టెక్నాలజీ, వారు నిర్దేశించిన షాపులలోనే బుక్స్ బ్యాగ్స్ తీసుకోవాలని వారి ద్వారా పాఠశాల యజమాన్యాలు కమిషన్లు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేర్లతో పిల్లల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ వారి నడ్డి విరుస్తున్నారు. ఎంతోమంది నిరుపేదలు పిల్లల చదువు కోసం నానా అప్పులు చేసి చదివిస్తున్నారని, కొన్ని పాఠశాలలో రేకుల షెడ్లలో నడుపుతూ ఇష్టానుసారంగా ఫీజులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు నియంత్రించి, మెరుగైన వసతులు కల్పించేలా చేయాలని ఎంఈఓను కోరారు.






