15 June, 2026 | 11:06 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ప్రతి హామీని అమలు చేస్తాం

10-10-2024 12:22 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఖమ్మం, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శా ఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం లో మంత్రి  పర్యటించారు.

అనంతరం ఖ మ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్‌బాబుతో కలిసి 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 92 మందికి   సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో గణేశ్, తహసీల్దార్ రాంప్రసాద్ పాల్గొన్నారు.

బుధవారం మంత్రి ఖమ్మం టీఎన్జీవోస్ కాలనీలో చేపట్టిన డంపింగ్ యార్డ్ అప్రోచ్, ఇంటర్నల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణపై మున్సిపల్ సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఒకటో డివిజన్ కార్పొరేటర్ హుస్సేన్ పాల్గొన్నారు.