5 May, 2026 | 7:08 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం

30-06-2025 12:14 AM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, ( గట్టుప్పల )జూన్ 29  ( విజయ క్రాంతి ):  మొదటి విడత రాని వారికి రెండో విడత జాబితాలో తప్పనిసరిగా అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారంగట్టుప్పల మండల పరిధిలోని అంతంపేట గ్రామంలో ప్రజా సమస్యలపై ఇంటింటికి తిరుగుతూ అడిగి తెలుసుకుంటున్నారు.

అదేవిధంగా ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరించే నిబద్ధతగల నాయకుని గ్రామ సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా ఎన్నుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. ఆ గ్రామానికి చెందిన గుడిసెలో నివసిస్తున్న కి రాములకు ఇందిరమ్మఇల్లు నిర్మించే బాధ్యత  నాదేనని ఆయన అన్నారు.

ఆ గ్రామంలో కరెంటు లూజ్ లైన్స్, గృహాల మీదుగా వెళుతున్న 11 కెవి కరెంట్ లైన్లను వెంటనే తొలగించాలని ఆయన అన్నారు. అంతంపేట నుండి దేవుల తండా, రాజ్య తండా రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించే విధంగా కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో గట్టుప్పల మండల ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.