5 May, 2026 | 8:44 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

ఖరీఫ్ పంటకు సాగునీరు అందించాలి

30-06-2025 12:15 AM

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్

వలిగొండ, జూన్29 (విజయక్రాంతి): బునాదిగాని కాల్వను యుద్ధ ప్రతిపాదికాన పూర్తి చేసి ఈ ఖరీఫ్ పంటకు సాగునీరు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.ఆదివారం  సిపిఐ వలిగొండ మండల 14వ మహాసభ నర్సాపురం గ్రామంలోని ధనలక్ష్మి  ఫంక్షన్ హాల్లో ఎలగందుల అంజయ్య  అధ్యక్షతన నిర్వహించారు.

ఈ మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ ముఖ్య అతిథిగా  హాజరై మాట్లాడుతూ పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు.

అసమానతలు లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల అంతిమ లక్ష్యమని, అన్యాయం, దోపిడీ, అణచివేతలున్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై కమ్యూనిస్టు పార్టీ  ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు యానాల దామోదర్ రెడ్డి, బోలగాని సత్యనారాయణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, బండి జంగమ్మ, ఎండీ ఇమ్రాన్, సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్క దయాకర్ రెడ్డి, మరుపాక వెంకటేష్, సలిగంజి వీరస్వామి, ఎల్లంకి మహేష్  పాల్గొన్నారు.