13 April, 2026 | 2:38 PM

రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణం కోసం సెక్రటేరియట్ ముట్టడిస్తా

13-12-2025 12:00 AM
  1. రేవంత్ పాలనలో రైతాంగం రోడ్డు ఎక్కింది
  2. గ్రామ గ్రామాన మన అభివృద్ధి మాత్రమే ఉంది 
  3. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి, డిసెంబర్ 12 ( విజయక్రాంతి ) : రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంను ప్రభుత్వం చెప్పట్టక పోతే ప్రజలతో కలిసి  సెక్రటేరియట్ ముట్టడిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.  రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం వనపర్తి మండలం కాసింనగర్, నాగమ్మ తండా, కేంద్రీయ తండా గ్రామాల బి.ఆర్.ఎస్ అభ్యర్థులు రెవెల్లి. రాములు, గోవిందు నాయక్ శక్రునాయక్ తరపున విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత సాగు నీటి కోసం 50కోట్లు మంజూరి చేయించి ‘రామన్న గట్టు రిజర్వాయర్‘నిర్మాణం కోసం పూనుకున్నాం అని దురదృష్టం ప్రభుత్వం అధికారం కోల్పోవడం వల్ల ముందుకు సాగలేదని ఈ ప్రభుత్వం రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణం నిర్లక్ష్యం చేస్తుందని అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏనాడైనా కె.సి.ఆర్ హయాములో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కినారా కానీ నేటి ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు రోడ్డు పాలైనారని,కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని, మద్దతు ధర,బోనస్ లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.  ఇన్ని కష్టాలు అనుభవించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రేవంత్ రెడ్డి మేము ఎన్ని తప్పులు చేసిన ప్రజలు మాకు మద్దతు ఇచ్చారని సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపు ఇచ్చారు.   గట్టు యాదవ్, రమేష్ గౌడ్, విజయ్ కుమార్, వేణు గోపాల్ పాల్గొన్నారు.