11 April, 2026 | 12:28 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

13-12-2025 12:00 AM

కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి 

నిజామాబాద్, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని మొక్కజొన్న రైతులకు తొలి విడతగా రూ. 10.00 కోట్ల నిధులు విడుదల అయ్యాయని అన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి 2,63,016 క్వింటాళ్ళ మొక్కజొన్న సేకరించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. క్వింటాలుకు మద్దతు ధర రూ. 2400 చొప్పున ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోందని తెలిపారు. మిగతా మొక్కజొన్న నిల్వలకు సంబంధించి కూడా వెంటవెంటనే ప్రభుత్వం రైతుల ఖాతాలలో బిల్లులు జమ చేయనుందని కలెక్టర్ సూచించారు.