అభ్యర్థులూ.. డబ్బు ధారపోసి ఆగం కావద్దు
- నిధులతోనే పల్లెల్లో ప్రగతి
బీజేపీ మద్దతు దారులను గెలిపించండి.. రూ.10 లక్షల నిధులు ఇస్తా..
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ
నారాయణపేట, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అప్పులు చేసి డబ్బులు ధారపోసి ఆగం కావద్దు అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు పాలమూరు ఎంపిడి కే అరుణ కోరారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని బిజెపి రాష్ట్ర నాయకులు కే. రతంగ్ పాండు రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాను రానూ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో ఒక్కో పంచాయితీలో ఓటుకు వెయ్యి నుంచి 6 వేల రూపాయలు దారపోధారని అలాగే ఏకగ్రివ ఎన్నికలకోసం లక్షలు దారపోశారని అన్నారు.అభ్యర్థులు అప్పులు చేసి డబ్బులు ధారపోసి ఆగం కావద్దు అని సూచించారు. రెండవ విడత 14వ తేదీన జరగబోతున్నాయనీ ఇప్పుడైనా అభ్యర్థులు జాగ్రత్త పడాలని కోరారు. ప్రజలు కోరుకునేది గ్రామ అభివృద్ధి, అందుబాటులో ఉండే వ్యక్తిని సర్పంచ్ లుగా ఎన్నుకోండనీ సూచించారు.
ప్రస్తుతం డబ్బు ప్రభావం పంచాయతీ ఎన్నిక ల్లో కనిపిస్తుండటం విచార కరమని అన్నారు.డబ్బులు పెట్టీ గెలిచిన నేతలకు, పనులు చేయాలనే ఆలోచన ఉండదనీ అన్నారు. గ్రామ పంచాయతీ లకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు శూన్యం అన్నారు. చేసిన పనులకు బిల్లులు కూడా చెల్లించలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పిసిసి చీఫ్ హోదాలో సర్పంచ్ లకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారనీ ఇంతవరకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదనీ విమర్శించారు.
గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తుంది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే నని అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతోనే సిసి రోడ్లు మొదలు కొని అనేక పనులు కేంద్రం నిధులతో జరుగుతున్నా యన్నారు. గ్రామ పంచాయ తీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా డైవర్షన్ చేస్తున్నారని అందుకే నేరుగా సర్పంచ్‌ల ఖాతాలలో కేంద్రం నిధులు వేస్తుందని తెలిపారు.
అనేక గ్రామాలకు ఇప్పటికి రోడ్లు లేవనీనారాయణపేట జిల్లాలో అనేక గ్రామాల్లో రోడ్లకు ప్రతిపాదనలు పెట్టడం జరిగిందనీ చెప్పారు. పలు రోడ్లకు శాంక్షన్ వచ్చిందని తెలిపారు. మిగతా రోడ్లకు మంజూరు తీసుకుంటానని చెప్పారు.అలాగే పి ఎం శ్రీ కింద పాఠశాలల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి.వాటి నిర్మాణాలలో కూడా ఆలస్యం వహిస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో అమలు చేసే ప్రతి పథకంలో 60శాతం కేంద్రం నిధులు ఉన్నాయనీ అన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీజేపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించుకోవాలని కోరారు. ఎంపీ నిధుల నుంచి ఆయా గ్రామాలకు 10లక్షల నిధులు అభివృద్ధికి అందజేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని మభ్య పెడుతున్నారని ఆరోపిం చారు.
కేంద్రం నిధులతోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. హ్యామ్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మా ణం కు టెండర్లు పిలుస్తున్న కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనీ అన్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పై విశ్వాసం ఎవరికి లేదనీ అన్నారు. భూములు అమ్మి ప్రభుత్వం నడుపుతున్నారనీ విమర్శించారు. పెన్షన్లు, జీతా లు భూములు అమ్మి చెల్లిస్తు న్నారని ఎద్దేవా చేశారు.
ప్రతి మహిళకు 2500వందల ఆర్థిక సాయం అని రెండేళ్లలో ఒక్కో మహిళకు 60వేల రూపాయలు బాకీ పడిందన్నారు. ప్రభుత్వం ప్రతి మహిళలకు బాకీ పడిన 60 వేలు ఇవ్వకుండా చీరలు ఇచ్చి మభ్య పెడుతున్నారని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కృషి చేసే కేంద్ర మోదీ సర్కార్ కు అండగా నిలబడాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగురావు నామాజీ, మాజీ జిల్లా అధ్యక్షులు పడకుల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, ప్రధాన కార్యదర్ధులు లక్ష్మీ శ్యామ్ సుందర్ గౌడ్, బలరాం రెడ్డి,జిల్లా కోశాధికారి సిద్ది వెంకట్ రాములు, మాజీ ప్రధాన కార్యదర్ధి రఘు రామయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్లు సుజాత, గోపాల్, సత్య రఘుపాల్, వెంకటయ్య, నారాయణపేట పట్టణ అధ్యక్షులు వినోద్, జిల్లా నాయకులు కృష్ణ, మీడియా కన్వీనర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.




