05-12-2025 01:41:23 AM
బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి కందికంటి విజయ్‌కుమార్
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 4: బండరావిరాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని బీఆర్‌ఎస్ బండరావిరాల సర్పంచ్ అభ్యర్థి కందికంటి విజయ్‌కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బండరావిరాల సర్పంచ్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బండరావిరాల గ్రామాన్నిఆదర్శ గ్రామంగా తీర్చిది ద్దుతానని అన్నారు.
విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి తదితర ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించి ప్రజల ఆదరణ పొందనని తెలిపారు. సర్పంచ్‌గా నన్ను గెలిపిస్తే మొదటగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతానని అన్నారు. నాకు అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ అబ్దుల్లాపూర్ మెట్ మండల అధ్యక్షులు కిషన్ గౌడ్, నాయకులు మెలుగు దానేష్, దయాకర్‌రెడ్డి, బొడిగె దయానంద్‌గౌడ్, గుండ్ల జంగయ్య యాదవ్ తదితరులున్నారు.