05-12-2025 01:41:57 AM
కోదాడ, డిసెంబర్ 4: 51వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా బాలుర జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహరావు గురువారం తెలిపారు. కోదాడ పట్టణంలో గురువారం వారి విలేకరులతో మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 5 నుంచి 7 వరకు మహబూబ్న గర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
ఎంపికైన క్రీడాకారులు సైదులు కెప్టెన్, నర సింహ, నరేందర్, సాయి, యాకస్వామి, యాసీన్, సాయిగౌతమ్, జావీద్, తెజేష్, భరత్ చంద్ర, చంద్రహరి, ఇమ్రాన్, చందు, దీరజ్. స్టాండ్బైగా గౌతమ్, కొటేష్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి జిల్లా ఖ్యాతిని పెంపొందించాలని వారు కోరారు.