calender_icon.png 7 December, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపాలపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

05-12-2025 12:00:00 AM

ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించండి

గోపాలపేట డిసెంబర్4: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సువర్ణ కు వచ్చిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచిగా గెలిపించండి గోపాలపేట గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతామని గడపగడపకు బొట్టు పెట్టి హామీ ఇచ్చారు. గురువారం గోపాలపేట మండల కేంద్రంలోని సర్పంచ్ పదవికి పదవి దక్కించుకోవాలన్న సంకల్పంతో ప్రతి కాలనీలోని ప్రతి ఇంటిని పట్టి ప్రజలను తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అర్థించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. ప్రజలంతా తనను దీవించి సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వాల వల్ల గ్రామాలన్నీ కొంటూ పట్టాయని ప్రజలకు సూచించారు. ఏ కాలనీ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే ప్రభుత్వానికి సర్పంచ్ గా సిఫారసు చేసి అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ముఖ్యంగా చిన్నవడ్డగిరి అయోధ్య కాలనీలో ప్రతి ఏటా వర్షం వస్తే చాలు జలదిగ్బంధంలో ఉంటుందని ఆ కాలనీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేను సర్పంచిగా గెలిచిన వెంటనే అయోధ్య కాలనీలో సమస్యలు లేకుండా చూస్తానన్నారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి భర్త ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.