calender_icon.png 7 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్‌లో కీరవాణి సంగీత కచేరి!

05-12-2025 12:00:00 AM

  1. ఈ నెల 8న ప్రత్యేక సంగీత కచేరి
  2. వివిధ కళారూపాలతో అతిథులకు ఆహ్వానం

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో అస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీత కచేరితో అలరించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రపంచ ప్రతినిధులకు భిన్న సాంస్కృతిక, కళారూపాలు అతిథులను అలరించనున్నాయి. ఈ సమ్మిట్ లో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరి ఉంటుంది.

ప్రముఖ వీణా విద్యాంసురాలు పి. జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సా మల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితోపాటు తెలంగాణ సంప్రదాయ కళారూపాలు సందడి చేయనున్నాయి.

తెలంగాణ రాష్ర్ట సంస్కృతి కళలను ప్రతిబించేలా కొమ్ముకో య, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మ హిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలా టం వంటి ప్రజాకళారూపాలతో అతిథులను ఆత్మీయం గా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13 తేదీ వరకు ఈ  వేడుకలను ప్రజలందరూ చూ సేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజులూ రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు.