05-12-2025 12:00:00 AM
అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన ప్రజలు
కొల్లాపూర్ రూరల్, డిసెంబర్ 4 : కొల్లాపూర్ మండలంలోని రామాపురం గ్రామం లో ప్రతి ఏటా నిర్వహించే శ్రీ అలివేల మంగ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంత నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి గుట్టపై సందడి చేశారు.
భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రామచం ద్రయ్య తెలిపారు. ఆనవాయితీగా ఈసారి కూడా కళ్యా ణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, భక్తులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం, భోజ నం, వసతి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలరాజ్, శ్రీరామ్, నిరంజన్, గ్రామస్తులు రామ స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.