14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

మంత్రి సహకారంతో జిల్లాలపల్లిన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

18-02-2026 08:42 PM

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో జిల్లాలపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామ సర్పంచ్ గడ్డం రాజేశం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీలు అన్నారు. బుధవారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి సర్పంచ్ రాజేశం గ్రామ ప్రజలు, బాలాజీ తో కలిసి బుధవారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లెలపల్లి నూతన గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి అని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం గ్రామ అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.

గ్రామస్తులందరూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జన్నె శ్రీవాణి ప్రవీణ్, వార్డు సభ్యులు గడ్డం గట్టయ్య, చిగురు పోచయ్య, రుద్రవేణ, రేవతి, శంకర్, సిద్ధ సమ్మయ్య, అనవేన తిరుమల సాయి కుమార్, పంచాయితీ రాజ్ ఏఈ జగదీష్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.