14 April, 2026 | 1:40 PM

పాఠశాలకు గ్యాస్ పొయ్యి, సిలిండర్ అందజేత

18-02-2026 08:46 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామ ప్రాథమిక పాఠశాలకు రైస్ మిల్ నిర్వాహకుడు యాద వెంకన్న రూ.5 వేల విలువైన సిలిండర్, గ్యాస్ పొయ్యిను అందజేశారు. దాత యాద వెంకన్నను పాఠశాల బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, గ్రామ సర్పంచ్ లిక్కి గురవమ్మ, ఉప సర్పంచ్ ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.