12-08-2025 12:42:18 AM
నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు
ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కరీంనగర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ పేద విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ ప డేది లేదనీ, పేద విద్యార్థుల చదువులకు ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం అ త్యంత ప్రాధాన్య మిస్తున్నదని ఎస్సీ ఎస్టీ మై నార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి మండలం చింతకుంట బాలికల గురుకుల పాఠశాలను మంత్రి లక్ష్మణ్ కు మార్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలను పర్యవేక్షించారు. విద్యా ర్థుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించా రు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, దొడ్డు బియ్యం ఎందుకు పెడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అధికారులు దొడ్డు బి య్యం పంపిణీ చేయడం సరైనది కాదన్నా రు.
గత 15 రోజులుగా దొడ్డు బియ్యం అ న్నం వండుతున్నారని ప్రిన్సిపాల్ మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే కరీంనగర్ డి ఎస్ ఓ తో మంత్రి ఫోన్లో మాట్లాడి వివరాలు క నుక్కుని గురుకులానికి సరఫరా చేసిన దొడ్డు బియ్యం వెంటనే మార్చాలని ఆదేశించారు. పేద విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడం ఏంటని డిఎస్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయంపై సివిల్ సప్లయిస్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్ తో మం త్రి ఫోన్లో మాట్లాడారు. రెండురోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేయాలనీ కమిషనర్ కు సూచించారు.
రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లకు దొడ్డు బియ్యం సరఫరా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ఎక్కడా ఇలాంటి తప్పిదాలు జరగకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా గురుకులంలో మెస్ పరిసరాలు మెరుగు పరచాలని, శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవు ట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి చర్య లు చేపట్టాలని సూచనలు చేశారు. మెస్ వద్ద అదనపు వాటర్ ప్లాంట్ నిర్మించాలని, వా రంలో స్టీల్ వంట పాత్రలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
వారం రోజుల్లో స్కూల్ పరిసరాలు కబ్జాకాకుండా ప్రహరీ నిర్మాణానికి , క్యాంపస్లో ఎలెక్ట్రిషియాన్ నియామకానికి చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు మం త్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. పిల్లలకు బాస్కెట్ బాల్ కోర్ట్, మైదానం అభివృద్ధి చే స్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమంలో రాజీ పడేది లేదని, తమ సీఎం, ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పిల్లలతో కలిసి మంత్రి భోజనం చేశారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏమైనా సమస్యలు ఉంటే అధికారులు, తమ దృష్టికి తీసుకురావచ్చని మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు.