calender_icon.png 12 August, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూర్‌లో భారీ వర్షం

12-08-2025 12:42:41 AM

వరద నీటితో జలమయమైన జీవన్గి.. ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు

తాండూరు 11 ఆగస్టు (విజయక్రాంతి): తాండూరు నియోజకవర్గం లోని పెద్దముల్ ,యాలాల, బషీరాబాద్, తాండూర్ ,మండలాలతో పాటు మున్సిపల్ పరిధిలో సోమవారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ దాదాపు జలమయం అయ్యాయి. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో వరద మీరు ఇళ్లల్లోకి చేరడంతో వంట సామాగ్రి పూర్తిగా తడిసి ముద్దయింది.

గ్రామంలో ఉన్న ప్రధాన రోడ్లన్నీ వరద నీటితో పొంగిపొర్లాయి . ఏకధాటిగా వర్షం కురిసే ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు గ్రామంలో పర్యటించని అధికారులు రాజకీయ నాయకులు అధికారులు రాజకీయ నాయకుల తీరు పై గ్రామస్తులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.