calender_icon.png 2 November, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాండ్ల కుల అభివృద్ధికి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి

01-11-2025 12:11:10 AM

ముకరంపుర,(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వెనుకబడిన కులాలకు ఇచ్చిన హామీ మేరకు మా గాండ్ల కుల అభివృద్ధికి కార్పోరేషన్ ఏర్పాటు చేసి,100 కోట్లు కేటాయించాలని గాండ్ల తిలకుల కుల ప్రధాన కార్యదర్శి జక్కం పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని స్మార్ట్ సిటి చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాండ్ల కులస్తులకు ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన విధంగా తెలంగాణలో గాండ్ల కుల కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.